NLG: తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. చింతపల్లి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన BSP మండల అధ్యక్షుడు ముదిగొండ మొగిలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.