E.G: గోదావరి డెల్టాను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఇవాళ ధవలేశ్వరం బ్యారేజీ వద్ద తూర్పు డెల్టాకు రబీ సాగు నీటి విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరి నదీమతల్లికి ప్రత్యేక పూజలు చేసి సాగునీరు విడుదల చేశారు.