కోనసీమ: గీతా జయంతి సందర్భంగా ఇవాళ ఆలమూరు మండలం చింతలూరు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మకు, ఆయన ఉపదేశించిన భగవద్గీత గ్రంథానికి పూజలు జరిపారు. అనంతరం సామూహిక గీతా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ జీవిత పరమార్థాన్ని తెలిపే ప్రతీ అంశం భగవద్గీతలో ఉందని అర్చకులు తెలిపారు