ATP: రాయదుర్గం నియోజకవర్గంలో వేరుశనగ పంట పెట్టి నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆర్సీపీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశాడు. ఇవాళ ఆర్సిపీ నాయకులతో కలిసి గుమ్మగట్ట మండలంలో నష్టపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఎకరాకు రూ. 10,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ తాహసీల్దార్కు వినతిపత్రం అందించారు.