E.G: విద్యాశాఖ నవశకాన్ని నిర్మించుకుంటూ నూతన విధానాలతో ముందుకు వెళుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇవాళ రాజమండ్రి రూరల్ మండలం రూరల్ మండలం సాటిలైట్ సిటీ హై స్కూల్ వద్ద అదనపు తరగతుల గదులను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు.