సత్యసాయి: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అమడగూరు మండలం చినగానపల్లి పంచాయతీ సచివాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు.