VZM: అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం “ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ” నిర్వహించారు. నిజమైన అసెంబ్లీని తలపించేలా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వాగ్ధాటితో, విషయ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెర్లాం మండలం, నెమలాం హై స్కూల్లో చదువుతున్న బూరిపేటకి చెందిన దువ్వు జయంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన ఆమెను సత్కరించారు.