KRNL: హాలహర్వి మండలం ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని MEO ఈరన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. అనంతరం పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు.