SKLM: ఆమదాలవలస మండలం దన్నానపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ మేళాలో మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన 26 మంది విద్యార్థులు రాణే మద్రాస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.బి జానకి రామ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.