KRNL: హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ హెచ్చరించారు. సోమవారం సి.క్యాంపులో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 120 మందిపై జరిమానాలు విధించి, 20 నిమిషాల్లో హెల్మెట్ తీసుకునేలా చేశారు. ఇకపై హెల్మెట్ ధరించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.