HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణములో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ గీతా జయంతి సందర్భంగా శ్రీ రాధాకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. రాధాకృష్ణ విగ్రహానికి నూతన వస్త్రాలు, పూల మాలతో అందంగా అలంకరించారు. అర్చకులు, భక్తులు దీపారాధన చేసి, నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం పండితులు భగవద్గీత పారాయణం చేశారు.