SRPT: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువకులకు అవకాశం కల్పించాలని తుంగతుర్తి మండలం గుడితండ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుగులోతు జయపాల్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా గెలిచాక, నా ఆస్తులు పెరిగితే గ్రామపంచాయతీకి రాసిస్తానని బాండ్ పేపర్‌పై రాసి సమర్పించారు.