TG: HYD చందానగర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద.. కార్మికులు వేసుకున్న గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. అక్కడ దాదాపు 50 గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదం సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.