శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వచ్చే ఏడాది ఆరు చిత్రాలు విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు సోదరుడు శిరీష్ తెలిపాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అక్షయ్‌కుమార్, పవన్ కళ్యాణ్‌తో కూడా చిత్రాలను నిర్మించబోతున్నట్లు వెల్లడించాడు. కాగా, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ కూడా 2026లో విడుదల కానుంది.