కోయంబత్తూరులోని లింగ భైరవి దేవి సన్నిధిలో ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు. ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన ప్రక్రియే ‘భూత శుద్ధి వివాహం’. ఇది వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. లింగ భైరవి ఆలయాల్లో ఈ వివాహ క్రతువును నిర్వహిస్తారు.