KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, సమస్యలపై అధ్యాపకులను ఆరా తీశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల చదువు, భద్రత, శ్రేయస్సుపై ప్రభుత్వం దృష్టి సారించిందని MLA తెలిపారు.