KRNL: మంత్రాలయం పట్టణం రామచంద్ర కాలనీ నుంచి ఇబ్రహీంపురం గ్రామానికి వెళ్లే నల్ల వంక రహదారిని ఎంపీటీసీ వెంకటేశు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వరదరాజు సచివాలయ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ఈ దారి గుండా వెళ్లే ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.