BHNG: రామన్నపేట మండలం, సూరారం, తుర్కపల్లి, బాచుప్పల గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం నార్కెట్ పల్లిలోని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసానికి చేరుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సూరారం, తుర్కపల్లి సర్పంచిగా బరిలో నిలిచిన బందెల జయశ్రీ పుల్లయ్య, జూలకంటి ధనమ్మ నరసింహలకు బీఆర్ఎస్ మద్దతును ఆయన ప్రకటించారు.