TG: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు రాలేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ సోనియాగాంధీ పుణ్యాన వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు.