KKD: అల్లవరం మండలం బోడసకుర్రులో ఇవాళ ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు. గోడిలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మీ పాల్గొన్నారు. ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.