W.G: తోలేరు మండలం ఉత్తరపాలెం గ్రామ శివారులో రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం రాశులను MLA పులపర్తి రామాంజనేయులు పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తేమ శాతం వంటి అంశాలను పరిశీలించారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.