NRPT: మక్తల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మక్తల్ పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి హాజరైన సీఎం ఇక్కడి పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయం అర్చకులు స్వాగతం పలికి, అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.