ASF: బెజ్జూర్ రేంజ్లో పెద్దపులి సంచారం ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వాగు అంచున స్పష్టమైన అడుగుజాడలు కనిపించాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఒంటరిగా బయటికి రావద్దని, పంట పొలాలకు గుంపులుగా వెళ్లి సాయంత్రం 4 గంటల ముందే ఇంటికి చేరాలని సూచించారు. పశువులతో అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.