సత్యసాయి: మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడగుంట శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.