GNTR: తెనాలి చెంచుపేటలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. సోమవారం సిబ్బందితో సహా అక్కడకు చేరుకున్న సీఐ సాంబశివరావు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. కాల్వలు దాటి రోడ్డు మీదకు వచ్చిన భారీ హోర్డింగులు, కొన్ని షాపులను తొలగించి ఆటోలలో తరలించారు. 15 రోజుల ముందుగానే షాపుల వారికి చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారని సీఐ అన్నారు.