KRNL: ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప మాలధారుల 41 రోజుల నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి రూ.1,50,000 విరాళం సోమవారం అందించారు. భక్తుల సేవే గొప్పదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.