జనగామలో గీతా జయంతి – శౌర్య దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక వేత్త, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ హాజరై మాట్లాడుతూ.. యువత హిందూ ధర్మపరిరక్షకులుగా నిలవాలి సూచించారు. భగవద్గీతని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు.