కోనసీమ: మండపేట పట్టణం 13వ వార్డులో ఇవాళ జరిగిన ఎన్.టి.ఆర్ భరోస ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొని ఫించన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటి అధ్యక్షులు కుక్కల రామారావు, పలివెల వెంకటేశ్వరరావు, వార్డు అధ్యక్షులు కుక్కల సత్యనారాయణ, గీసాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.