AP: వచ్చే 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని అన్నారు. త్వరలో సంజీవని ప్రాజెక్టు తెస్తామని వెల్లడించారు. అలాగే, జనవరిలోపు రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్పారు. సుపరిపాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించారని తెలిపారు.