ATP: ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం అవ్వ, తాతలకు రూ.3000 నుంచి 4 వేల పింఛన్లను పెంచిన ఘనత ఒక ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం గుంతకల్లులో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పింఛన్లను పంపిణీ చేశారు.