కేరళలో HIV కేసులు పెరగటం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతి నెలా సగటున 100 కొత్త HIV కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు గల యువతకు ఈ వ్యాధి సోకుతోంది. గత మూడేళ్లలో ఎర్నాకుళం జిల్లాలో 850 కేసులు, తిరువనంతపురం(555), త్రిస్సూర్(518) జిల్లాల్లో అధిక కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో పురుషులు(3,393), మహిళలు (1,065) ఉన్నారు.