పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన హీరోయిన్గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్గా రాశీ ఖన్నా కనిపించనుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని రాశీ ఖన్నా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయబోతున్నారు.