కృష్ణా: గుడ్లవల్లేరు మండల గ్రామ సచివాలయ & వెల్ఫేర్ సర్వీసెస్ అధికారిగా వీ.ఎలిషా రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండల స్థాయిలో జరిగే వివిధ ప్రజా సేవలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో సేవల పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎంపీడీవో ఇమ్రాన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.