AP: సూపర్ సిక్స్ హామీలు ఇస్తే ఎగతాళి చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే, సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి చూపించామని చెప్పారు. ’18 నెలల్లో పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం. ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేయబోతున్నాం. ఏపీ కంటే ధనిక రాష్ట్రాలు కూడా ఇంత ఖర్చు చేయడం లేదు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్ అందిస్తున్నాం’ అని వెల్లడించారు.