AP: వైసీపీకి రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ మోషేన్‌రాజును కలిశారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్, ఎమ్మెల్సీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా? అని ఎమ్మెల్సీలను మండలి ఛైర్మన్ ప్రశ్నించారు. వైసీపీలో ఉండలేక, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే స్వచ్ఛందంగా రాజీనామాలు చేసినట్లు ఎమ్మెల్సీలు వివరించారు.