MBNR: జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డిని నూతనంగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు ఆయనను సోమవారం ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సమచిత స్థానం ఇస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్వాల్, టీపీసీసీ సెక్రెటరీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.