MDK: తూప్రాన్ మండలంలో నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. ఇవాళ ఏకాదశి కావడంతో నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మద్దతుదారులతో తరలి రావడంతో నామినేషన్ కేంద్రాల పరిసరాలు మద్దతుదారులతో నిండిపోయింది. నాగులపల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి అక్కంగారి శ్రీలత భారీ ఎత్తున మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్ వేశారు.