WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగేల్లి అన్నమ్మ ఇవాళ నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో సమచుత న్యాయం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర సీఎం, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.