TG: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండేళ్ల విజయోత్సవ సభలను మక్తల్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎంతమంది పాలకులు మారినా.. ఈ జిల్లా రూపురేఖలు మారలేవని విమర్శించారు. 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని గుర్తు చేశారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది.. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుందన్నారు.