W.G: మొగల్తూరు మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన పేరుపాలెం బీచ్ వద్ద సోమవారం అలల ఉధృతి స్పష్టంగా కనిపించింది. సాధారణ రోజులతో పోలిస్తే అలలు ఎక్కువగా ఎగసిపడుతున్నాయి. తుఫాను ప్రభావం కారణంగా బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో బీచ్‌ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు.