TG: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానానికి బీసీ మహిళ రిజర్వ్ కావడంతో తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌తో 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబ మధ్య కలహాలు ఏర్పడ్డాయి. తల్లికి BRS మద్దతు తెలుపగా.. కూతురుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.