అధిక నైపుణ్యం గల వృత్తుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని నియామకాల సంస్థ వర్క్ ఇండియా తెలిపింది. సృజనాత్మక, డిజైన్ ఉద్యోగాల్లో మహిళలు చేరడం 2024తో పోలిస్తే ఈ ఏడాది 98% పెరిగినట్లు పేర్కొంది. గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ క్రియేషన్, విజువల్ కమ్యూనికేషన్ వంటి సాంకేతిక కోర్సులను మహిళలూ వృత్తిగా ఎంచుకుంటున్నారని వెల్లడించింది.