MNCL: బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి, తాండూర్ మండలం మాదారం-3 ఇంక్లైన్ నుంచి పలువురు యువకులు BRS పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత BRS ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. స్థానిక ఎన్నికల్లో యువత BRS అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు.