W.G: ఆకివీడు రైల్వే స్టేషన్ పరిధిలో గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో సోమవారం నిలిచిపోయింది. ఆకివీడు నుంచి కైకలూరు వెళ్లే మార్గంలో దుంపగడప రైల్వే గేట్ వద్ద ఆగిపోయింది. సుమారు గంటపాటు రైలు గేట్లో నిలిచిపోవడంతో గేటు తెరవలేదు. దీంతో ఈ మార్గంగా ఉండా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా సిద్దాపురం రైల్వే గేటు గుండా ప్రయాణాలు సాగించారు.