NZB: నవీపేట్ మండలం యంచ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని ఆపి పత్రాలు, వాహనంలో ఉన్న సరుకు, నగదు తరలింపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ రవాణా, డబ్బు పంపిణీ, మద్యం సరఫరా, ప్రలోభాల ప్రయత్నాలను అరికట్టే లక్ష్యంతో ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.