MNCL: విద్యార్థులు ఇష్టపడి చదివితే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం సులభతరమని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల బాలికల కళాశాల, సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సులను ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.