MHBD: జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)గా రాజేశ్వర్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత DEO దక్షిణామూర్తి VRS తీసుకోవడంతో ఖాళీ అయిన పదవిలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD)గా పనిచేస్తున్న రాజేశ్వర్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజేశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.