కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై అపోహలు వీడి, అవగాహన పెంపొందించాలని అన్నారు. సమయానికి పరీక్షలు, సురక్షిత జీవనశైలి, మాత్రమే రక్షణ మార్గమని పేర్కొన్నారు.