BHPL: గోరికొత్తపల్లి మండలంలోని శ్రీ గురుదేవ ఆశ్రమంలో ఇవాళ గీతాజయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆశ్రమాధిపతి శ్రీ సహజానంద స్వాములవారి ఆధ్వర్యంలో భక్తులు భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం నిర్వహించారు. స్వాములవారు మాట్లాడుతూ.. భగవానుడే స్వయంగా చెప్పిన ఏకైక గ్రంథం భగవద్గీత అన్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు గీతోపదేశం చేశారని వివరించారు.