KDP: కడప నగర సీపీఎం కార్యదర్శి రామ్మోహన్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మృత్యుంజయకుంట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డబ్బులు విడుదలలో విఫలమైందని, అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.